ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలి: నీలం మధు ముదిరాజ్

politics Telangana

పటాన్ చెరు, సంగారెడ్డిలో కాంగ్రెస్ బీఎల్ఎలకు సర్ పై అవగాహన కార్యక్రమం

ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి దామోదర

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గంలో జరుగుతున్న కుట్రపూరిత ఓటు చోరీపై కాంగ్రెస్ శ్రేణులు నిఘా పెట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడటమే ధ్యేయంగా పనిచేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పటాన్ చెరులో పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో జరిగిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి దామోదర రాజా నరసింహ, ఎంపీ సురేష్ షెట్కర్,ఎం ఎల్ ఏ సంజీవ రెడ్డి, మాజీ ఎం ఎల్ ఏ జగ్గారెడ్డి, చైర్మన్ ఫయీం, గాలి అనిల్ కుమార్ గార్లతో కలిసి ఆయన పాల్గొన్నారు, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పాటి చౌరస్తాలోని ఎస్.వి.ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన “ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల ప్రక్రియ అవగాహన సదస్సు”కు టిజిఐఐసి చైర్మన్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్, మెదక్ పార్లమెంట్ పరిశీలకుడు ప్రీతం, పటాన్ చెరు నియోజకవర్గ పరిశీలకుడు దయాకర్ తో పాటు నీలం మధు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాలలో, పార్టీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా, కుట్రపూరితంగా తొలగించే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది సామాన్యుడి ఆయుధమని, అలాంటి ఓటును దొంగిలించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియను కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అక్రమ తొలగింపులను అడ్డుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కుకు అర్హులైన 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను ఫారం-6 ద్వారా ఓటర్లుగా నమోదు చేయించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

సదస్సుకు అధ్యక్షత వహించిన నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్స్ లతో కలిసి సమన్వయంతో పనిచేయాలని, ఓటు చోరీకి పాల్పడే అక్రమార్కుల ఆట కట్టించాలని పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను మరింత ఎగురవేయడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *