మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం తహసిల్దార్ నరహరి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్ చెరు మండలంలో భూమి సర్వే సమస్యల పనులు గత రెండు సంవత్సరాలుగా దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలు నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయని ఆరోపించారు.. 2026 జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 300 దరఖాస్తులు సమస్యలు పరిష్కారం చేయాలని విన్నవించుకుంటే, కేవలం 30 దరఖాస్తులు మాత్రమే ఎలా సర్వే సమస్యలు పరిష్కారం చేస్తారని ప్రశ్నించారు. అనేక సంవత్సరాలుగా భూమి సర్వే సమస్యలు, పౌతి మార్పిడి సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంశంలో సర్వేయర్ పాత్ర కీలకమైందని గుర్తు చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా సర్వేర్ మాత్రం సర్వే మ్యాప్ లు ఇవ్వకుండా మండలంలో ఉన్న దరఖాస్తుదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రుద్రారం, లక్డారం, నందిగామ, ముత్తంగి, ఇంద్రేశం మరియు ఇతర గ్రామాలలో ఒక్కొక్క గ్రామం నుంచి 70 నుంచి 80 మంది దరఖాస్తులు చేసుకున్న నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ఒక్క ఆరు నెలల కాలంలోనే మండల సర్వేయాలు ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా, ఇలాంటి సమస్యలు పరిష్కారం చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకోసం పటాన్ చెరు మండలంలో ఉన్న భూముల సర్వే, ఫౌతి మార్పిడి లో సర్వే సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మండల ప్రజల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం చేస్తున్నామని మండల అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మల్లేష్, చంద్రయ్య, పోచయ్య లు పాల్గొన్నారు.
