అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…
– ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్
పటాన్ చెరు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ బిల్డర్లకు సూచించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి సుభాష్ అధ్యక్షతన బిల్డర్ల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సర్పంచ్ బండి హరీష్ శంకర్ మాట్లాడుతూ… పంచాయతీ అనుమతుల ప్రకారం జి ప్లస్-2 భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు, జి ప్లస్-2 మించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జి ప్లస్-2 ఆపై నిర్మించాలని కొనేవారు ఖచ్చితంగా హెచ్ఎండీఏ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. అనుమతు లు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలకు నోటీసులిచ్చి కూల్చివేస్తామని హెచ్చరించారు. కూల్చివేసిన వాటిని తిరిగి నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దుర్గారెడ్డి, రాజు, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…