Telangana

ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం _ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. దేవాలయాలు కేవలం ఆరాధన స్థలాలే కాకుండా గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని ఆయన అన్నారు.మంగళవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దేవాలయ స్లాబ్ నిర్మాణ పనులను   కొబ్బరికాయ కొట్టి స్లాబ్ పనులను నీలం మధు ముదిరాజ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాలయాల నిర్మాణంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తుల మనసుల్లో శాంతి, భక్తి భావనలు పెంపొందుతాయని తెలిపారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం లక్డారం గ్రామానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.ఇప్పటికే ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయంగా విరాళం అందజేశానని, భవిష్యత్తులో కూడా ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి చొరవ చూపుతున్న ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago