politics

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అయితే శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతియుతంగా నిరసన తెలిపిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం సరికాదని, ఇలాంటి చర్యలకు బీజేపీ కార్యకర్తలు భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండకల్ ఆనంద్ కుమార్, ములుగు జిల్లా ఓబీసీ ఇంచార్జ్ బుర్ర మహేందర్ యాదవ్, మాదాపూర్ డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి శివ యాదవ్, మాదాపూర్ డివిజన్ మాజీ కార్యవర్గ సభ్యులు రాజ వర్ధన్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, బీజేవైఎం మాజీ జనరల్ సెక్రెటరీ లింగస్వామి శేరిలింగంపల్లి యువమోర్చా సభ్యులు హర్షిత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago

అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

రేషన్ షాపులలో 14 రకాల వస్తువులను ఇవ్వాలి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలిసిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా …

2 days ago