మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ వావ్ (WOW) అవార్డుతో సత్కరించింది. కాగితపు వ్యర్థాల పునర్ వినియోగం, స్థిరమైన ప్రాంగణ పద్ధతులు, గీతం అత్యుత్తమ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ కు అనుగుణంగా, వనరుల విభజన, పునర్వినియోగంలో రాణించిన పాఠశాలలు, సంస్థలకు హైదరాబాదులోని ఐటీసీ వావ్ ఈ అవార్డులను ప్రదానం చేసింది.బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను మరింత ముందుకు తీసుకెళ్లడంలో గీతం సిబ్బంది సామూహిక ప్రయత్నాలకు ప్రోత్సహించేందుకు గాను ఇచ్చిన ఈ అవార్డును విద్యార్థి ప్రతినిధులతో కలిసి, గీతం ఆతిథ్య బృందం అందుకుంది.
ఈ చొరవలో భాగంగా, గీతం హైదరాబాదు 20,975 కిలోల కాగితపు వ్యర్థాలను ఐటీసీ-వావ్ యొక్క జాతీయ రీసైక్లింగ్ కార్యక్రమానికి అందించింది. దీని ఫలితంగా 2025-26 సంవత్సరంలో నీరు, శక్తి, భూమి గణనీయంగా ఆదా అవడంతో పాటు చెప్పుకోదగ్గ రీతిలో కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించినట్టు ఐటీసీ అందజేసిన ప్రశంసా పత్రంలో పేర్కొంది.ఈ గుర్తింపు, ప్రాంగణంలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్క బృంద సభ్యుడికి చెందుతుందని ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ అభిప్రాయపడ్డారు. గీతంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడు, వావ్ వంటి కార్యక్రమాలు అమలుకు మించి ఉమ్మడి సంస్కృతిగా మారతాయన్నారు. రాబోయే సంవత్సరాలలో ఈ చొరవను మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యంగా అంబిక పేర్కొన్నారు.గీతం హైదరాబాదు విద్యార్థులు, సిబ్బంది చెప్పుకోదగ్గ పరిమాణంలో, ప్రభావం ఆధారిత స్థిరత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా చేయడం ద్వారా పర్యావరణ నిర్వహణ పట్ల తన నిబద్ధతను గీతం చాటుకుంటోంది.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…