ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి…
– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు
పటాన్ చెరు:
రైతులు ధాన్యం అమ్మడానికి తీసుకొని వచ్చే ముందు ఎండబెట్టి తేమశాతం 17 వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. సోమవారం పటాన్ చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా తేమ శాతం పరీక్ష చేయించుకొని టోకెన్ ఇచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రానికి దాన్యం తీసుకొని రావాలని అన్నారు. వర్ష సూచన ఉన్నట్లయితే పంట కోతను తదనుగుణంగా వాయిదా వేయాలి, కోసినట్లయితే పంటను టార్పాలిన్ పట్టాలతో కప్పి ఉంచాలన్నారు. రాబోయే వర్షాకాలంలో దృష్ట్యా రైతులు నాణ్యమైన విత్తనాలు మాత్రమే లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడిఎ బి.జె సురేష్ బాబు, ఎంఏఓ ఉష, ఏఈఓ దేవిసింగ్, కొనుగోలు కేంద్రం ఇంచార్జి రాజు, రైతులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…