మనవార్తలు ప్రతినిధి , జిన్నారం:
జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పురపాలక సంఘం తొలి పాలకవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మండల పరిషత్ గా ఉన్న జిన్నారం నేడు మున్సిపల్ గా మారడం జరిగిందని ఇందుకు అనుగుణంగా ప్రతి వార్డు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడాలని.తదనంతరం ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలని ప్రజాప్రతితులకు సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ మున్సిపాలిటీని అభివృద్ధికి ప్రత్యేకగా తీర్చిదిద్దాలని విన్నవించారు. అభివృద్ధి పనులు సమస్యల పరిష్కార అంశంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…