మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ :
సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పదవ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని సంపూర్ణ విశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరారు. గత దశబ్ద కాలంగా నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులకు సొంత నిధులతో పరీక్ష సామాగ్రి తో పాటు మోటివేషనల్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు కృష్ణ, గోపాల్, ఉపేందర్ రెడ్డి, రాములు, బిజీలీ రాజు, నాయకులు శ్రీకాంత్, దాసు, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్, యాదగిరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సోమ్ల నాయక్, క్షత్రియ యూత్ ఫెడరేషన్ ప్రతినిధులు రాజు, ప్రశాంత్ వర్మ, రాము, రామరాజు, కె వి ఎస్ ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…