54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
నియోజకవర్గ ప్రజల సంక్షేమం.. ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్లకు సంబంధించిన సంబంధించిన 54 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 24 లక్షల 43 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తుందని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెల లక్షలాది రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసిలు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి. అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, సీనియర్ నాయకులు సత్యనారాయణ, వెంకటేష్, ఐలేష్, రామచంద్రా రెడ్డి, శివరాజ్, శివా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…