Telangana

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు . పటాన్‌చెరు నియోజకవర్గంలోని ముత్తంగి రింగ్‌రోడ్ సమీపంలో 45 ఆవులు ఉన్న వాహనాన్ని గుర్తించి విహెచ్‌పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిపైన గోమాఫియా దాడి చేశారు . ఈ ఘటనపై విహెచ్‌పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు స్పందిస్తూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర మాట్లాడుతూ ముత్తంగి రింగ్‌రోడ్ సమీపంలో గో రక్షణ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది అని గో సంరక్షణ కోసం పనిచేస్తున్న కార్యకర్తలపై గో మాఫియా దారులు దాడి చేసి, వారి వద్ద ఉన్న బంగారు గొలుసు, చేతి గడియారం మరియు సుమారు ₹45,000 నగదు దోచుకున్నారని,గో రక్షణ కార్యకర్తలపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, దోపిడీకి గురైన బంగారం, వాచ్ మరియు నగదు తిరిగి ఇప్పించాలని పోలీసుల ద్వారా పంపించిన ఆవులను తిరిగి గోశాలలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ విభాగ్ సంయోజక్ మనోజ్, బీజేపీ నాయకులు బెజుగం శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, రవీందర్, గోశాల సభ్యులు విఠల్, అడ్వకేట్ రమేష్, బజరంగ్ దళ్ ప్రఖండ ప్రాముఖ్ సందీప్, గోరక్ష ప్రాముఖ్ సాయితేజ, నగర ప్రాముఖ్ సూరజ్, రాజగోపాల్, సంగమేశ్, సాయి, చేతన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago