Telangana

జూలై 18న ఛలో యువ సంగ్రామ సదస్సు

పటాన్‌చెరు నియోజకవర్గం నుండి 5 వేల మంది హాజరు

మోసాలకు చిరునామా కాంగ్రెస్

నిరుద్యోగ డిక్లరేషన్ అమలులో ఘోర వైఫల్యం

నిరుద్యోగులు నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఎస్ ఐ ఆర్ అంశంలో అప్రమత్తంగా ఉండండి

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ఎన్నికల ముందు యువజన ప్రకటనలో (నిరుద్యోగ డిక్లరేషన్) నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు పటాన్‌చెరు నియోజకవర్గం నుండి 5 వేల మంది యువత హాజరుకానునట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను ఆయన వెల్లడించారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న నేటికి యువజన సంక్షేమంపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ యువతను, రైతులను, మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందని పేర్కొంటూ, ఈ యువజన సమావేశం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతుందని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నియామకాలలో జాప్యం చేయడం ద్వారా ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోసిందని విమర్శించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, డివిజన్లు, గ్రామాల నుండి ఐదు వేల మంది యువత సదస్సుకు హాజరు కాబోతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago