ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ ఫార్మసీ 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇండస్ట్రియల్ ఫార్మసీలో ఎం.ఫార్మ్. కోర్సును ప్రారంభించడానికి భారత ఫార్మసీ కౌన్సిల్ (పీసీఐ) ఆమోదించింది. దీనితో పోస్టు గ్రాడ్యుయేట్ విద్య మరింత బలోపేతం కావడంతో పాటు, ఫార్మసీ వృత్తి నిపుణులు కావాలనుకునే వారికి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ మంగళవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.ఈ చేర్పుతో, స్కూల్ ఆఫ్ ఫార్మసీ నాలుగేళ్ల బి.ఫార్మ్ కోర్సుతో పాటు ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్ అనే మూడు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోందని తెలియజేశారు. ఈ కొత్త కోర్సు, ఫార్మాస్యూటికల్ తయారీ, నాణ్యత హామీ, నియంత్రణ వ్యవహారాలు, పారిశ్రామిక పరిశోధన రంగాలలో విద్యార్థులకు ఉన్నత పరిజ్జానం, పరిశ్రమ-ఆధారిత నైపుణ్యాలను అందించేలా రూపొందించామన్నారు.స్కూల్ ఆఫ్ ఫార్మసీ నాణ్యమైన విద్య, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా తన విద్యాపరమైన ఖ్యాతిని నిరంతరం బలోపేతం చేసుకుంటోందని తెలిపారు.
తన విద్యాపరమైన స్థాయిని మరింత పటిష్టం చేస్తూ, ఈ స్కూల్ ఎన్ఐఆర్ఎఫ్ 2025 ర్యాంకింగ్స్ లో ఫార్మసీ విభాగంలో 33వ ర్యాంకును పొందిందన్నారు.ఫార్మసీ ప్రిన్సిపాల్ గా తన నేతృత్వంలో, ఈ స్కూల్ అనేక ముఖ్యమైన మైలురాళ్లను సాధించినట్టు ప్రొఫెసర్ శివకుమార్ తెలియజేశారు. అధ్యాపక బృందం పరిశోధన, ఆవిష్కరణ, ఫార్మసీ విద్యలో వారి నైపుణ్యానికి గాను ప్రతిష్టాత్మక అవార్డులు, పేటెంట్లు, జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులను కూడా అందుకున్నట్టు ఆయన వివరించారు.ఫార్మసీ స్కూల్ ఔషధ ఆవిష్కరణ, న్యూరోడీజెనరేటివ్, క్యాన్సర్ చికిత్సలు, అధునాతన ఔషధ పంపిణీ వ్యవస్థలు, నానోథెరనోస్టిక్స్, త్రీడీ ప్రింటింగ్, సస్టెయిన్డ్-రిలీజ్ ఫార్ములేషన్స్ వంటి రంగాలలో గణనీయమైన కృషి చేసి, ఒక శక్తివంతమైన పరిశోధనా కేంద్రంగా కూడా ఆవిర్భవించిందన్నారు. అధిక ప్రభావం చూపే జర్నల్స్ లో ఈ స్కూల్ ప్రచురణల రికార్డు నిరంతరం పెరుగుతూ ఉండటం, అత్యాధునిక ఫార్మాస్యూటికల్ పరిశోధన, ప్రపంచ విద్యా నైపుణ్యం పట్ల తమ సంస్థ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రొఫెసర్ శివకుమార్ వివరించారు.
ఇండస్ట్రియల్ ఫార్మసీలో ఎం.ఫార్మ్ కోర్సను ప్రవేశపెట్టడం అనేది, ఫార్మాస్యూటికల్ పరిశ్రమ యొక్క మారుతున్న అవసరాలను తీరుస్తూనే, పరిశోధన, ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణకు దోహదపడే అత్యంత నైపుణ్యం గల ఫార్మసీ నిపుణులను తయారు చేయాలనే గీతం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు.మరిన్ని వివరాల కోసం https://www.gitam.edu/hyderabad/gitam-school-of-pharmacyని సందర్శించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
పటాన్‌చెరు నియోజకవర్గం నుండి 5 వేల మంది హాజరు మోసాలకు చిరునామా కాంగ్రెస్ నిరుద్యోగ డిక్లరేషన్ అమలులో ఘోర వైఫల్యం…