Telangana

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే… పటాన్‌చెరు గులాబీ దండు కదిలే 

యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు 

ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో 1200 ల వాహనాల్లో తరలి వెళ్లిన గులాబీ శ్రేణులు..

జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పల్లెలు, పట్టణాల నుండి కదం తొక్కిన నిరుద్యోగులు, బిఆర్ఎస్ కార్యకర్తలు

నిరుద్యోగుల గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

యూత్ డిక్లరేషన్ పేరుతో యువత భవిష్యత్తుకు చరమగీతం పాడారు

2028లో ఎగిరేది గులాబీ జెండాయే

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు :

అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయమంటే ఎండ్రిన్ తాగి చావాలంటూ వ్యాఖ్యలు చేస్తోందని త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడంతో పాటు 2028 ఎన్నికల్లో తిరిగి గులాబీ జెండా ఎగరం ఖాయమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సుకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో 1200 వాహనాల్లో గులాబీ శ్రేణులు బయలుదేరి వెళ్లాయి. శనివారం ఉదయం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన ర్యాలీని జిఎంఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పటాన్‌చెరు పురవీధుల గుండా ఓఆర్ఆర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్వయానా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ 2023 లో సరూర్ నగర్ స్టేడియం వేదికగా యూత్ డిక్లరేషన్ ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓటు కొట్టు  జాబ్ పట్టు అని ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు ఉద్యోగాలు ఏవని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను ఎండ్రిన్ తాగి చావాలంటూ వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ దురాహంకారానికి అర్థం పడుతుందని విమర్శించారు.

జాబులు నింపడంలో విఫలమైనా రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ కి సుట్ కేసులు పంపడంలో గోల్డ్ మెడల్ సాధిస్తున్నారని ఎద్దేవా చేశారు.అరచేతిలో స్వర్గం చూపించి అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని 2028లో తిరిగి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యువత, విద్యార్థి, నిరుద్యోగులకు సువర్ణ యుగం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువత, విద్యార్థి, మహిళ, కార్మిక విభాగాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago