గీతంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు

Telangana

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రారంభం: వెల్లడించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలు కొనసాగుతున్నట్టు బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఒక కీలక విద్యా మైలురాయిగా, విశ్వవిద్యాలయం తన బహుళ విషయక అభ్యాస పర్యావరణ వ్యవస్థను మరింత విస్తరిస్తూ, గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రారంభించినట్టు తెలియజేశారు.హైదరాబాదు ప్రాంగణం ఈ ఏడాది అనేక కొత్త కోర్సులను ప్రవేశపెట్టిందని తెలిపారు. వాటిలో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ; బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సహకారంతో బీబీఏ (ఎంటర్ ప్రెన్యూర్ షిప్); అలాగే బీఎస్సీ మైకోబయాలజీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎంటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎం. ఫార్మా (ఇండస్ట్రియల్ ఫార్మసీ వీసీఐ ఆమోదం పొందాల్సి ఉంది) వంటివి ఉన్నట్లు వివరించారు. ఈ మార్పుచేర్పులు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ పోకడలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యను తీర్చిదిద్దాలనే గీతం నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయన్నారు.

గీతం హైదరాబాదు ప్రత్యేకత, దాని లిబరల్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్ అని, ఇది విద్యార్థులకు వివిధ విభాగాలలో మేజర్, మైనర్లను కలపడానికి వీలుకల్పిస్తూ, ఆయా విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా విద్యనభ్యసించ వచ్చని తెలిపారు. ఈ విధానం అభ్యాసకులను భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను పెంపొందించుకుంటూ, జ్ఞానంలో లోతు, విస్మతి.. రెండింటినీ పొందేందుకు అనుమతిస్తుందన్నారు.గీతం ప్రవేశ పరీక్ష (గాట్ – 2026) ద్వారా గానీ, లేదా టీజీ/ఏపీ ఈఏపీసెట్, ఎన్ సెట్, నాటా, జేఈఈ, సీయూసెట్, క్యాట్ (TG & AP EAMCET, NCET, NATA, JEE, CUET, CAT), ఇతర గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షల ద్వారా కూడా ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. అర్హత పరీక్షలో చూపిన ప్రతిభ, పనితీరు ఆధారంగా, విద్యార్థులు ట్యూషన్ ఫీజు, ఆహారం, వసతిలో వంద శాతం వరకు ఉపకార వేతనాలను (స్కాలర్ షిప్) పొందవచ్చని పేర్కొన్నారు.విశ్వవిద్యాలయం నిర్వహించే జాతీయ- స్థాయి ప్రవేశ పరీక్ష (గాట్-2026) జూన్ 28న దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ విధానంలో జరగనుందని, దానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 26న అని వెల్లడించారు.

గీతం, హైదరాబాద్ ప్రాంగణం తన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్, బిజినెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, అర్కిటెక్చర్, ఫార్మసీ, పబ్లిక్ పాలసీ, కొత్తగా స్థాపించిన స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా వివిధ కోర్సులను అందిస్తోందన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఫార్మసీ, అర్కిటెక్చర్, సైకాలజీ, ఎకనామిక్స్, మీడియా స్టడీస్, టీచర్ ఎడ్యుకేషన్ వంటి పలు అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించినట్లు తెలియజేశారు. గీతం హైదరాబాద్, 350కి పైగా ప్రముఖ నియామక సంస్థలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తూ, విభిన్న రంగాలలో ఉద్యోగ అవకాశాలను అందిస్తోందన్నారు.

గీతం హైదరాబాదు పరివర్తనాత్మక విద్య వ్యక్తులను అర్థవంతమైన వృత్తిని నిర్మించుకోవడానికి, సమాజానికి దోహదపడటానికి శక్తినిస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు తెలిపారు. స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రారంభించడం, రోబోటిక్స్, ఏఐ, వ్యవస్థాపకత, జీవశాస్త్రాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం వంటివి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేయాలనే గీతం నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు. లిబరల్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్, బహుళ-విషయాల అభ్యాస వాతావరణం ద్వారా. విద్యార్థులు వారి ఆసక్తులను అన్వేషించడానికి, విమర్శనాత్మక నైపుణ్యాలను పెంపొందించు కోవడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నిపుణులుగా, ఆవిష్కర్తలుగా, నాయకులుగా ఎదగడానికి తాము ఆవకాశాలను కల్పిస్తున్నట్లు ఒకింత గర్వంగా వెల్లడించారు. ఇతర వివరాల కోసం www.gitum.eduను సందర్శించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *