Districts

మ‌హిళాభ్యున్న‌తికి పెద్ద‌పీట‌ వేస్తున్న వైసీపీ ప్రభుత్వం:ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని

అడ‌గ‌కుండానే జ‌గ‌న‌న్న వ‌రాలు
నాదెండ్ల‌లో ఘ‌నంగా వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం ప్రారంభం

గుంటూరు జిల్లా

మ‌హిళాభ్యున్న‌తికి పెద్ద పీట వేస్తున్న ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మండ‌ల కేంద్రం నాదెండ్ల‌లో వైఎస్సార్ భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని గురువారం ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడు కూడా అడిగితేనే వ‌రాలిస్తాడ‌ని త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు అడ‌గ‌కుండానే ఎన్నో వ‌రాలు ఇస్తున్నార‌ని తెలిపారు. ఇప్పుడు ద‌స‌రా కానుక‌గా రాష్ట్రంలోని సుమారు 90 ల‌క్ష‌ల‌ మంది మ‌హిళామ త‌ల్లుల‌కు ఆర్థిక ల‌బ్ధి చేకూర్చ‌బోతున్నార‌ని చెప్పారు.

వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం ద్వారా సుమారు 9 ల‌క్ష‌ల‌ డ్వాక్రా సంఘాల రుణ‌మాఫీ రెండో ద‌ఫా మొత్తాల‌ను ఈ రోజు నేరుగా మ‌హిళ‌ల బ్యాంకు ఖాతాల్లోకి మ‌న ప్ర‌భుత్వం జ‌మ చేస్తున్న‌ద‌ని చెప్పారు. మ‌హిళ‌ల కోసం మ‌న ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేస్తోందని చెప్పారు. ప‌సిపిల్ల‌ల ద‌శ‌ నుంచి అవ్వ‌ల వ‌ర‌కు అన్ని వ‌య‌సుల వారికి ఏదో ఒక ప‌థ‌కాలు నేడు మ‌న రాష్ట్రంలో మ‌గువ‌ల కోసం అమ‌ల‌వుతూనే ఉన్నాయ‌ని తెలిపారు.

_మ‌హిళ‌లంద‌రికీ మ‌న ప్ర‌భుత్వ ఒక గ‌ర్వ‌కార‌ణం

ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ మ‌న రాష్ట్రంలో త‌ల్లిబిడ్డ‌ల‌కు పౌష్టికాహారం అందించ‌డం కోసం వైఎస్సార్ సంపూర్ణ పోష‌ణ ప్ల‌స్ అమ‌ల‌వుతోందని చెప్పారు. ఆరేళ్ల పిల్ల‌ల నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు పిల్ల‌ల చ‌దువుల కోసం అమ్మ ఒడి ప‌థ‌కం అమ‌ల‌వుతోందని తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా త‌ల్లుల ఖాతాల‌కే నేరుగా మ‌న ప్ర‌భుత్వం ఏటా రూ.15,000 న‌గ‌దు అంద‌జేస్తున్న విష‌యం మ‌నంద‌రికీ తెలుసని చెప్పారు. ముఖ్యంగా 45 ఏళ్లు నిండిన మ‌హిళ‌లకు ఆర్థిక స్వేచ్ఛ‌ను ఇచ్చేలా వైఎస్సార్ చేయూత‌, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ప‌థ‌కాలను త‌మ ప్ర‌భుత్వ అమ‌లుచేస్తున్న‌ద‌ని తెలిపారు. ఈ ప‌థ‌కాల ద్వారా పెద్ద మొత్తంలో ఆడ‌ప‌డుచుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అవుతున్న‌ద‌ని చెప్పారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం ఇంత‌గా ప‌రిత‌పిస్తున్న ప్ర‌భుత్వాలు ఈ దేశంలోనే మ‌రే రాష్ట్రంలోనూ లేవ‌ని ఒక మ‌హిళా శాస‌న‌స‌భ్యురాలిగా నేను స‌గ‌ర్వంగా చెబుతున్నాన‌ని ఆనందం వ్య‌క్తంచేశారు. మ‌హిళ‌లంద‌రికీ మ‌న ప్ర‌భుత్వం ఒక గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని స్ప‌ష్టంచేశారు.

అర్హులంద‌రికీ వైఎస్సార్ ఆస‌రా

ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారని చెప్పారు. అర్హత ఉన్నా పొరపాటున ఆ జాబితాల్లో పేర్లు మిస్ అయిన‌ సంఘాలు ఏవైనా ఉంటే, వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల‌ని తెలిపారు. విచారణ చేప‌ట్టి వెంట‌నే వారికి కూడా రుణాలు మంజూరు చేస్తామన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో
డిపిఓ కేశవరెడ్డి,ఏరియా కో ఆర్డినేటర్ హనుమా నాయక్,ఎంపీడీఓ మోషే,ఏపీఎం భరత్,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎంపీపీ తలతోటి రాణి,కో ఆప్షన్ సభ్యులు షేక్ మూసా ఇస్లాం,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు, సుబ్బారావు,కాండ్రు శేషయ్య, మస్తాన్ వలి,యల్లారావు,వెంకటేష్ ,నరసింహారావు,నెల్లూరి వెంకయ్య మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago