Telangana

జర్నలిస్టు సంఘం నేత యాదగిరిని సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి:

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు యాదగిరి బి ఆర్ ఎస్ శాసనసభాపక్ష ఉప నేత హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం సాయంత్రం శాలువాతో సత్కరించారు. సంగారెడ్డి లోని చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం హరీష్ రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు నూతన కార్యవర్గ ఎన్నిక గురించి జిల్లా మహాసభ గురించి  సమాచారం కొందరు నాయకులు హరీష్ రావుకు తెలిపారు. దీంతో వెంటనే అక్కడనే ఉన్న జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరికి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపి ,శాలువా కప్పి అభినందించారు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందించారు . ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా శాలువాకప్పి బండారు యాదగిరిని సన్మానించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ నేత రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ నేతలు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్రెడ్డి, చింత సాయినాథ్, గోవర్ధన్ నాయక్ , జీవి శ్రీనివాస్ , షేక్ సాబేర్ ,శ్రీధర్ రెడ్డి, మల్ల గౌడ్, తదితరులు టి యు డబ్ల్యూ జే ఐ జేయు అధ్యక్షుడు బండారు యాదగిరికి శుభాకాంక్షలుతెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

6 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

6 hours ago