Telangana

అంతర్జాతీయ సదస్సులో వక్తగా గీతం అధ్యాపకురాలు

గోవాలో జరిగిన ఐసీటీ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ&ఎంఎల్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్, గోవాలోని తాజ్ వివాంటాలో ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన 11వ అంతర్జాతీయ ఐసీటీ సదస్సు, అవార్డుల ప్రదానోత్సవంలో గీతం తరఫున ఆహ్వానిత వక్తగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని సోమవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

వివిధ రంగాలలో స్మార్ట్, అనుసంధానిత, సుస్థిర పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరివర్తనాత్మక పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రొఫెసర్ పర్వేకర్ ఒక విశ్లేషణాత్మక ప్రసంగం చేసినట్టు తెలియజేశారు. సాంకేతిక ఆవిష్కరణల ద్వారా వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో ఐవోటీకి పెరుగుతున్న ప్రాముఖ్యతను ఈ ప్రసంగంలో నొక్కి చెప్పారన్నారు.

మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై చర్చించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి, సహకార పరిశోధనలకు అవకాశాలను అన్వేషించడానికి ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులను ఒక చోట చేర్చిందని తెలిపారు. ఆవిష్కరణలను, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడంలో అంతర్విషయ పరిశోధన, బలమైన విద్యా-పరిశ్రమ భాగస్వామ్యాల ప్రాముఖ్యతను ఈ సదస్సు చాటిచెప్పిందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ పరిశోధకులు, నిపుణుల అత్యాధునిక పరిశోధన కృషిని కూడా ప్రదర్శించినట్టు తెలియజేశారు.ప్రొఫెసర్ పర్వేకర్ భాగస్వామ్యం, నాణ్యమైన పరిశోధనను ప్రోత్సహించడం, ఆవిష్కరణలు పెంపొందించడం, వర్ధమాన సాంకేతికతలపై ప్రపంచ చర్చలకు దోహదపడటం పట్ల గీతం నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు.

ఈ సదస్సుకు హాజరైన ప్రముఖులలో గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తొలి మహిళా అధ్యక్షరాలు ప్రతిమా గౌరీష్ ధోండ్; మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటీ) చైర్మన్, సలహాదారు, మెంటర్, అధ్యక్షుడు నితిన్ కుంకోలియంకర్; బెల్ గ్రేడ్ లోని సింగిడునమ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, ఏఐ ప్రాజెక్టు అధిపతి ప్రొఫెసర్ మిలన్ టూబా తదితరులు ఉన్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago