Telangana

ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

టైలర్స్ కాలనీలో రూ.55 లక్షలతో మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్:

అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, రక్షిత మంచినీటి సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.అమీన్పూర్ డివిజన్‌లోని టైలర్స్ కాలనీలో జలమండలి ఆధ్వర్యంలో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ ప్రాంతంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మరింత బలోపేతం చేయడానికి నూతన పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ పనులు పూర్తయిన అనంతరం టైలర్స్ కాలనీ ప్రజలు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రతి కాలనీని ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, జలమండలి జిఎం శ్రీనివాస్ రెడ్డి, డీజీఎం శివ, ఏఈ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, జగదీష్, గోపాల్, రాములు, చంద్రశేఖర్, రాజు, బాలరాజు, స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago