మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) అన్నారు.రాష్ట్రస్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ పోటీల్లో పాల్గొననున్న పటాన్‌చెరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్లను సోమవారం సాయంత్రం మైత్రి మైదానంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. క్రీడల ద్వారా ఆరోగ్యం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెంపొందుతాయని పేర్కొన్నారు.ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి, సంక్షేమం కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ కొనసాగుతాయని హామీ ఇచ్చారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పటాన్చెరు జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలవాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు కృష్ణ యాదవ్, మహిపాల్ రెడ్డి, రాజేష్, లక్ష్మారెడ్డి, పవన్, నాగేష్, అంజి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…