Andhra Pradesh

సినీనటి నిధి అగర్వాల్ చేతుల మీదుగా హ్యాపీ మొబైల్స్ ఫ్రాంచైజీ వ్యాపారం ప్రారంభం

హ్యాపీ మొబైల్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఫ్రాంచైజీ భాగస్వాములకు ఆహ్వానం.

మనవార్తలు ప్రతినిధి ,తిరుపతి :

ఎనిమిదేళ్ల క్రితం వినియోగదారులకు నమ్మకమైన పారదర్శకమైన సులభమైన టెక్నాలజీ సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన హ్యాపీ మొబైల్స్ నేడు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ మల్టీ బ్రాండ్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ గా ఎదిగింది ఒకే స్టోర్ తో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 100కు పైగా స్టోర్లతో లక్షలాది మంది వినియోగదారులకు సేవలు అందిస్తూ విశ్వసనీయ బ్రాండ్ గా నిలిచింది.సినీనటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ హ్యాపీ మొబైల్ ఫ్రాంచైజీ ప్రారంబొత్సవానికి తిరుపతి రావడం చాలా సంతోషంగా ఉంది, నాకు ఎప్పుడు తిరుపతి వచ్చిన చాలా హ్యాపీ ఉంటుంది. నేను పెళ్ళి చేసుకున్నా ఫస్ట్ తిరుపతి కె వస్తా అని అన్నారు.ప్రస్తుతం హ్యాపీ మొబైల్స్ కేవలం మొబైల్ ఫోన్లకే పరిమితం కాకుండా స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్స్, టెలివిజన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ గాడ్జెట్స్ లో వేరబుల్స్ యాక్సిసరీస్ పై ఉత్పత్తుల ఫైనాన్స్ సదుపాయాలు, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ వంటి సేవలను ఒకే చోట అందిస్తోంది.

అలాగే మొదటి సారి రాజంపేట హ్యాపీ మొబైల్ ఫ్రాంచైజీ స్టోర్ లో ఏసీ మరియు వాషింగ్ మెషీన్ల కూడా అందుబాటులో ఉన్నాయి.బలమైన రిటైల్ నెట్వర్క్ సమర్ధవంతమైన వ్యాపార విధానాలు మార్కెట్ అనుభవంతో హ్యాపీ మొబైల్స్ ఇప్పుడు తన తదుపరి అభివృద్ధి దశలోకి అడుగుపెడుతోంది, ఇప్పుడు మరిన్ని నగరాలకు హ్యాపీ ని తీసుకెళ్లే సమయం వచ్చింది.తదుపరితరం పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలను అన్వేషిస్తున్న పారిశ్రామికవేత్తలకు హ్యాపీ మొబైల్స్ ఫ్రాంచైజీ భాగస్వామిగా మారెందుకు ఆహ్వానం పలుకుతోంది, ఇది కేవలం వ్యాపార అవకాశం మాత్రమే కాదు, విశ్వసనీయమైన బ్రాండ్ తో కలిసి విజయవంతమైన రిటైల్ వ్యాపారాన్ని నిర్మించుకునే అరుదైన అవకాశం. హ్యాపీ మొబైల్స్ సి.ఎమ్.డి కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ మరియు సి.ఓ.ఓ శశి కిరణ్ మాట్లాడుతూ ప్రతి కొత్త స్టోర్ మా వ్యాపార విస్తరణ మాత్రమే కాదు, కొత్త ప్రాంత ప్రజలకు కూడా అదే స్థాయి విశ్వాసం, సేవ, నిబద్ధతను అందించే మరో అవకాశం. భాగస్వాములను ఆహ్వానించడం ద్వారా రిటైల్ వ్యాపారాన్ని మాత్రమే కాకుండా, బలమైన సంబంధాలను నిర్మించే మా ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కావాలని మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో మరిన్ని నగరాలకు హ్యాపీని తీసుకెళ్లాలి అని తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago