రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి:
ఓల్డ్ ఎం.ఐ.జి., శేరిలింగంపల్లి ప్రాంతంలో గత సుమారు 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలు రైల్వే విస్తరణ పనుల నేపథ్యంలో గుడిసెలు కోల్పోతున్న సమస్యపై పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి ఈరోజు బాధిత కుటుంబాలతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్న పేద కుటుంబాలు రైల్వే విస్తరణ కారణంగా గుడిసెలు కోల్పోయి నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు కేటాయించాలని కోరారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రైల్వే విస్తరణలో గుడిసెలు కోల్పోతున్న అర్హులైన బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలకు అండగా ఉంటామని, వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో లింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…