Telangana

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని యండిఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో చెరుకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసి ఛట్ పూజ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ పటాన్‌చెరు ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన వారంతా పరస్పర గౌరవం, సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు. వివిధ పండుగలు ప్రజల మధ్య ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.గత మూడు సంవత్సరాలుగా ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందని తెలిపారు.యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉత్తర భారతీయులందరికీ ఛట్ పూజ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సూర్యభగవానుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని పృథ్వీరాజ్ ఆకాంక్షించారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

5 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

20 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago

స్కాలర్స్ ఇన్నోవిస్టా–2026 ఘనంగా ముగింపు

 -350 మంది విద్యార్థులతో శాస్త్రీయ ప్రదర్శన  - విద్యార్థుల ప్రతిభను అభినందించిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త రాజ్‌కుమార్  - విద్యార్థులు నిరంతరం కొత్త…

21 hours ago