ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన
పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు
రెండు వేల మంది భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
కార్తీక మాస శనివారాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని శాంతి నగర్ కాలనీ (గ్యాస్ గోదాం పక్కన) కొలువై ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రధాన అర్చకులు మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి మహా చండీయాగం, విశేష పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగాయి.ఉదయం స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కన్నుల పండువగా సింధూర వర్ణ అలంకరణ చేయగా, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో లోకకల్యాణార్థం లక్ష్మీ గణపతి హోమం, మహా చండీయాగం మరియు సింధూర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిగామ మాజీ సర్పంచ్, పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థాన కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏపూరి శివానందం దంపతులతో పాటు మరో 25 మంది దంపతులు పీటలపై కూర్చుని మహా చండీయాగంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా పూర్తి చేశారు.హోమ, పూజా కార్యక్రమాల అనంతరం ఏపూరి శివానందం దంపతుల ఆధ్వర్యంలో దాదాపు 2,000 మంది భక్తులకు భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపూరి శివానందం మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాస శనివారం రోజున స్వామివారి సన్నిధిలో మహా చండీయాగం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం, లోకకల్యాణం కోసం ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, దేవస్థాన కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…
-350 మంది విద్యార్థులతో శాస్త్రీయ ప్రదర్శన - విద్యార్థుల ప్రతిభను అభినందించిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త రాజ్‌కుమార్ - విద్యార్థులు నిరంతరం కొత్త…