Telangana

స్కాలర్స్ ఇన్నోవిస్టా–2026 ఘనంగా ముగింపు

 -350 మంది విద్యార్థులతో శాస్త్రీయ ప్రదర్శన 

– విద్యార్థుల ప్రతిభను అభినందించిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త రాజ్‌కుమార్ 

– విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలి 

– పాఠశాల ప్రిన్సిపాల్ జనార్ధన్ రెడ్డి  

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో స్కాలర్స్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కాలర్స్ ఇన్నోవిస్టా–2026’ విద్యా ప్రదర్శన ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, వర్కింగ్ మోడల్స్, వినూత్న ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డీఆర్డీఎల్), హైదరాబాద్ సైంటిస్ట్ ‘ఎఫ్’ వి. రాజ్‌కుమార్ హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. దేశ అభివృద్ధికి తోడ్పడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ కె. జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాలు, పరిశోధనలు, నూతన ఆలోచనల ద్వారా సంపూర్ణమవుతుందని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్నోవిస్టా గొప్ప వేదికగా నిలిచిందన్నారు. ప్రదర్శనను సందర్శించిన తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులకు జనార్ధన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago