మై విజ్ సంస్థ సహా వ్యవస్థాపకులు అనిల్ కుమార్ మోకరాల
పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా,విద్యార్థులకు అవసరమైన ఆచరణాత్మక జ్ఞానం రూపొందించేలా కార్యక్రమాలు
విజ్ఞాన్ ప్రధానోపాధ్యాయురాలు పద్మవల్లి
విజ్ఞాన్ విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
‘తరంగ్ – 2026’ ఇతివృత్తంతో విద్యార్థుల సృజనాత్మకతకు పట్టం
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనా దృక్పథాన్ని అలవర్చుకోవాలని మై విజ్ సంస్థ సహా వ్యవస్థాపకులు అనిల్ కుమార్ మోకరాల పేర్కొన్నారు.పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామ పరిధిలోని విజ్ఞాన్ విద్యాలయంలో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ‘తరంగ్ – 2026’ అనే వినూత్న ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నూతన ఆలోచనలు, ఆవిష్కరణాత్మక నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మై విజ్ సంస్థ సహా వ్యవస్థాపకులు అనిల్ కుమార్ మోకరాల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, చదువుతోపాటు ఆటపాటలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, అయితే దానిని సరైన రీతిలో వినియోగించుకోవాలే తప్ప దానికి బానిసలుగా మారకూడదని హితవు పలికారు.
విద్యార్థుల సమగ్ర వికాసానికి విద్యతోపాటు విలువలు, క్రమశిక్షణ, సృజనాత్మకత కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.వేడుకల్లో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనశాలలు, యువ పారిశ్రామికవేత్తల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆహార పదార్థాలు, హస్తకళా వస్తువులు, స్వయంగా తయారుచేసిన ఉత్పత్తులు, వినోదాత్మక ఆటల స్టాళ్లను విద్యార్థులు ఏర్పాటు చేశారు. వస్తువుల తయారీ, ధరల నిర్ణయం, బడ్జెట్ రూపకల్పన, మార్కెటింగ్, వినియోగదారులతో సంభాషణ వంటి అంశాలను స్వయంగా నిర్వహిస్తూ తమ వ్యాపార నైపుణ్యాలను ప్రదర్శించారు.అలాగే కృత్రిమ మేధస్సు ( ఏఐ), నూతన సాంకేతిక ఆవిష్కరణలపై ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహించారు. ‘KRIYOTHSAV’26’ పేరుతో నిర్వహించిన యాక్టివిటీ పేజెంట్‌లో విద్యార్థులు పాఠ్యాంశాలపై తమకున్న అవగాహనను వినూత్న రీతిలో ప్రదర్శించారు. ప్రీ-ప్రైమరీ చిన్నారుల తోలుబొమ్మల ప్రదర్శనలు, సృజనాత్మక కళాకృతులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మవల్లి మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే పాఠశాల ప్రధాన లక్ష్యమన్నారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, విద్యార్థులకు జీవితంలో అవసరమైన ఆచరణాత్మక జ్ఞానం, సామాజిక బాధ్యత, స్వతంత్ర ఆలోచనా శక్తి, వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పాఠశాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు.
ఇందులో భాగంగా సామాజిక బాధ్యతను పెంపొందించే సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, గృహ నిర్వహణపై అవగాహన కల్పించే గృహ విజ్ఞాన శాస్త్రం, ఆహార పదార్థాల తయారీ, ప్రదర్శనకు సంబంధించిన ఆహార కేంద్రాలు, వ్యాపార ఆలోచనలు, ఔత్సాహికతను ప్రోత్సహించే నూతన వ్యాపార ప్రదర్శనలు, విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే హస్తకళలు, స్వయంగా తయారుచేసుకునే వస్తువులు, ఆటలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, నాటకాలు, కళా ప్రదర్శనలు, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన విద్యా కార్యకలాపాలు, కళలు, ప్రదర్శనలు వంటి విభిన్న కార్యక్రమాలకు పాఠశాలలో ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.చదువుతోపాటు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సామాజిక స్పృహ, ఆచరణాత్మక జ్ఞానం, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులు, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు పాఠశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రతి విద్యార్థి అన్ని రంగాల్లోనూ రాణించేలా తీర్చిదిద్దేందుకు విజ్ఞాన్ విద్యాలయం నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు.తరగతి గది అభ్యాసాన్ని నిజ జీవిత అనుభవాలతో అనుసంధానిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో విశేష ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై, విద్యార్థుల ప్రతిభను ఆసక్తిగా తిలకిస్తూ వారిని ప్రోత్సహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కార్యక్రమాలను అభినందిస్తూ వేడుకల విజయానికి తమ వంతు సహకారం అందించారు.‘చిన్న ఆలోచనలు… గొప్ప ఆవిష్కరణలు… అపరిమిత అవకాశాలు’ అనే నినాదంతో సాగిన ‘తరంగ్ – 2026’ బాలల దినోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…