Telangana

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రామిరెడ్డి ఆసుపత్రి సమీపంలో వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పటాన్‌చెరు మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న శ్రీకాంత్ గౌడ్‌కు గురుస్వాములు, అయ్యప్ప మాలధారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు. ఆ కలియుగ దైవం అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఈ పడి పూజ కార్యక్రమంలో నాగరాజు స్వామి, దానయ్య గురుస్వామి, పరమేశ్వర గురుస్వామి, గోపాల్ గురుస్వామి, సురేష్ రెడ్డి గురుస్వామి, ఫాల్గుణ గురుస్వామిలతో పాటు స్థానిక నాయకులు, కాలనీవాసులు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

5 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

20 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago

స్కాలర్స్ ఇన్నోవిస్టా–2026 ఘనంగా ముగింపు

 -350 మంది విద్యార్థులతో శాస్త్రీయ ప్రదర్శన  - విద్యార్థుల ప్రతిభను అభినందించిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త రాజ్‌కుమార్  - విద్యార్థులు నిరంతరం కొత్త…

21 hours ago