Telangana

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

– సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు

– పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి

– ఈ పురస్కారం మరింత బాధ్యతను పెంచింది: తేనా అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ

తెల్లాపూర్, మనవార్తలు ప్రతినిధి:

సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత కొన్నేళ్లుగా చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.పౌర సమస్యల పరిష్కారం, పరిశుభ్రత, పచ్చదనం పెంపు, ప్రజారోగ్యం, సామాజిక సంక్షేమం వంటి అంశాల్లో ప్రభుత్వ శాఖలు, అధికారులు, సీఎస్ఆర్ సంస్థలతో కలిసి తేనా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఈ పురస్కారం తేనా నాయకత్వం, సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సీఎస్ఆర్ భాగస్వాముల సమష్టి కృషికి దక్కిన గుర్తింపు అని అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ తెలిపారు. ఈ అవార్డును తెల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు.జాతీయ స్థాయి పురస్కారం తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి తెల్లాపూర్‌ను పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రమణ పేర్కొన్నారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

5 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

20 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

స్కాలర్స్ ఇన్నోవిస్టా–2026 ఘనంగా ముగింపు

 -350 మంది విద్యార్థులతో శాస్త్రీయ ప్రదర్శన  - విద్యార్థుల ప్రతిభను అభినందించిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త రాజ్‌కుమార్  - విద్యార్థులు నిరంతరం కొత్త…

21 hours ago