రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి:
మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి అన్నారు .బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్ కమ్యూనిటీ సెంటర్‌లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్ ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలకు .ముఖ్య అతిథిగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీస్ మెసేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజ్ ఉర్ రెహమాన్ ప్రత్యేక ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా సిరాజ్ ఉర్ రెహమాన్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం, సహనం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సందేశమిచ్చారు. సమాజంలో మత సామరస్యం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి, సోదరభావం, ఐకమత్యంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మునీర్, కార్యదర్శి రియాజ్ బాషా, బీహెచ్ఈఎల్ ఐఎన్ టియూసి అధ్యక్షులు రెహమాన్, మైనారిటీ నాయకులు అజీముద్దీన్, బాబా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బూన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది పేపర్ కి పెద్ది గ కావాలి
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…
-350 మంది విద్యార్థులతో శాస్త్రీయ ప్రదర్శన - విద్యార్థుల ప్రతిభను అభినందించిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త రాజ్‌కుమార్ - విద్యార్థులు నిరంతరం కొత్త…