politics

ఎండీఆర్ ఫౌండేష‌న్ కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు పట్టణంలోని ఎండీఆర్ ఫౌండేష‌న్ కార్యాలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.అనంతరం మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ దీపావళి పండుగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రమిదల వెలుగుల తరహాలోనే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ, ఆనందం, ప్రేమ, ఐకమత్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, సురక్షితమైన పద్ధతుల్లో ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలను జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago