బొల్లారం , మనవార్తలు ప్రతినిధి:
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నెలా నిర్వహించే మండల స్థాయి సమావేశాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరి అంజిరెడ్డి పిలుపు మేరకు సోమవారం బొల్లారం సిఎంసి 272వ డివిజన్ కోర్ కమిటీ ముఖ్య సమావేశం నిర్వహించారు .బిజెపి పట్టణ అధ్యక్షుడు కెజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బొల్లారంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, వాటి పరిష్కారానికి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని బిజెపి నాయకులు తీర్మానించారు.ఈ సందర్బంగా రోడ్ల దుస్థితి,వీధిదీపాలు గురించి చర్చించారు. ఐటీసీ కంపెనీ నుంచి బొల్లారం గాంధీ బొమ్మ వరకు రోడ్డంతా గుంతలమయంగా మారిందని, వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఐటీసీ నుండి గాంధీ బొమ్మ వరకు మరియు హనుమాన్ టెంపుల్ నుండి మైలాన్ కంపెనీ వరకు వీధిలైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కొత్త వీధిలైట్లను ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్ సమస్యలు: పెన్షన్ పొందే కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక వృద్ధులు, దివ్యాంగులు పడుతున్న అవస్థలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు: కార్మికులు, పేద ప్రజలు ఎక్కువగా ఉండే బొల్లారంలో ఇప్పటికీ ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం చాలా విచారకరమని, వెంటనే బొల్లారంలో ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు బిజెపి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…