షెడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక స్థలాలు కేటాయిస్తాం…
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
పందుల పెంపకం కోసం స్థలం కేటాయించి షెడ్లు నిర్మిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో ఎరుకుల సంఘం సభ్యులతో సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పటాన్ చెరు పరిధిలో పందుల పెంపకం దారులు, పందుల పెంపకం విషయంలో ప్రజలకు సహకరించాలని అన్నారు. విచ్చలవిడిగా రోడ్లపై పందులను వదిలేయకుండా ప్రత్యేక షెడ్ లను ఏర్పాటు చేసి అందులో పందులను పెంచుకోవాలని సూచించారు. ఇందుకోసం పటాన్ చెరు లో స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి, పందుల పెంపకం దారులకు ప్రత్యేక నిధులు అందే విధంగా చూస్తామని అన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఎరుకుల సంఘం వాళ్లంతా పందుల పెంపకం విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ… అంటువ్యాధులు ప్రబలకుండా పందుల పెంపకం దారుల అందరికీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రత్యేక స్థలాలు కేటాయిస్తారని చెప్పడం అభినందనీయమని అన్నారు. వారి జీవనోపాధి కోసం ప్రభుత్వం నుంచి లోన్లు వచ్చే విధంగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి ,కార్పొరేటర్ మెట్టు కుమార్ ,టిఆర్ఎస్ నాయకులు దశరథ రెడ్డి, ఎరుకల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, సంగారెడ్డి కుర్ర రాములు కుర్ర ఎల్లయ్య, బీహెచ్ఈఎల్ ఇంజనీర్ శంకరయ్య ,జిల్లా అధ్యక్షులు గోపాల్, పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షులు యాదయ్య ,అమీన్పూర్ అధ్యక్షులు తమ్మయ్య ,పటాన్చెరు జనరల్ సెక్రటరీ రాజు, కోశాధికారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…