అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా
తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు
మనవార్తలు ప్రతినిధి , అమీన్‌పూర్ :
అమీన్‌పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ మాజీ వైస్ ఎంపీపీ కోకల శ్రీనివాస్ నేతృత్వంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారులు సానుకూలంగా స్పందించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు. బీరంగూడలోని ప్రసిద్ధ శంభునిగుడి సమీపంలోని సర్వే నంబర్ 783లో సుమారు 20 గుంటలు, అలాగే సర్వే నంబర్ 767లో సుమారు 3 గుంటల ప్రభుత్వ భూమి ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే అక్కడ ఆక్రమణలు బహిరంగంగా కనిపిస్తున్నాయని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమిని కాపాడకపోతే భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల కోసం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం కొరత ఏర్పడుతుందని వినతిపత్రంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సర్వే అధికారులతో సదరు సర్వే నంబర్లలో సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ భూమికి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేయాలని, అక్రమణలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో మాజీ వార్డు సభ్యులు సిహెచ్ లింగం గౌడ్, పట్లోళ్ల భాస్కర్ రెడ్డి, అమీన్ పూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…