తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్..
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు సిఎస్ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తోషిబా యాజమాన్యాన్ని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం లో గల తోషిబా పరిశ్రమ యాజమాన్యం ప్రతినిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు పరిశ్రమ యాజమాన్యం సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.ప్రధానంగా ఇటీవల పటాన్‌చెరు నియోజకవర్గానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కావడం జరిగిందని శాశ్వత ప్రతిపాదికన అమీన్పూర్ పరిధిలోని సర్వేనెంబర్ 993లో కళాశాల భవనం, హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. నిధుల కొరత మూలంగా భవన నిర్మాణ పనులు ముందుకు కొనసాగడం లేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో కళాశాల మరియు హాస్టల్ భవన నిర్మాణాల కోసం 45 కోట్ల 70 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులు అంచనాల రూపొందించడం జరిగిందని వారి దృష్టికి తీసుకెళ్లారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని పారిశ్రామిక రంగానికి అత్యంత ఆవశ్యకమైన ఇంజనీర్లను తయారు చేయడంలో పాలిటెక్నిక్ కళాశాల కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనాల నిర్మాణ కోసం పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పరిశ్రమ యాజమాన్యాకి విజ్ఞప్తి చేశారు.వీటితో పాటు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లో పరిధిలో పారిశుధ్య నిర్వహణలో కీలకమైన వాహనాల కొనుగోళ్లకు సైతం సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని కోరారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన పరిశ్రమ యాజమాన్యం ప్రతినిధులు అతి త్వరలో యాజమాన్యంతో చర్చించి సిఎస్ఆర్ నిధులు కేటాయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఈ సమావేశంలో పరిశ్రమ సిఎండి హిరోషి ఫురుట, డైరెక్టర్ మానవ వనరుల విభాగం కట్టుతోషి మారుమోతో, హెచ్ ఆర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…