Telangana

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. శ్రీధర్ ఫైనాన్స్ ట్రాక్ లో మొదటి స్థానం పొంది, ఉత్తమ పత్ర అవార్డును గెలుచుకున్నారు. బెంగళూరులోని క్రైస్ట్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన వ్యాపార ఆవిష్కరణ, పరివర్తనపై అంతర్జాతీయ సమావేశం (ICFBIT 2026)లో ఆయన ఈ ప్రశంసలందుకున్నారు.‘స్థిరమైన పరివర్తన, ఆర్థిక మార్కెట్లు, పర్యావరణ హిత సాంకేతిక సంస్థలలో ఐబీసీ పాత్ర’ అనే శీర్షికన డాక్టర్ శ్రీధర్ సమర్పించిన పరిశోధనా పత్రం సమీక్ష మండలి మన్నననలను చూరగొంది. ఇది ఎంతో వాస్తవికంగా, లోతైన పరిశోధనతో, చక్కని భావ ప్రకటనలో ఎంతో స్పష్టంగా ఉందని ప్రశంసించింది. సదస్సు నిర్వాహక కమిటీ కూడా ఈ పత్రం విద్యాపరంగా అభిప్రాయాలను సూటిగా వెల్లడించిందని, సమావేశ ఇతివృత్తానికి సంబంధించిన ఔచిత్యానికి అనుగుణంగా ఉందని పేర్కొంది.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తాతో సహా గీతం నాయకత్వం ఈ విజయాన్ని సాధించిన డాక్టర్ శ్రీధర్ ను అభినందించింది. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించమని ఆయనను ప్రోత్సహించింది.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago