Telangana

ముత్తంగి డివిజన్ సమగ్ర అభివృద్ధికి భారీగా నిధులు

రూ.1.83 కోట్లతో సీసీ రోడ్లు, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

చట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా విధులు కేటాయిస్తూ.. అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ముత్తంగి డివిజన్ కేంద్రంలోని మధురానగర్, గాయత్రి కాలనీలలో రూ.1.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు, ఘనపూర్ గ్రామంలో రూ.13 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న వార్డు కార్యాలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్తంగి డివిజన్ పరిధిలోని కాలనీలు, వార్డులలో ప్రజల అవసరాలకు అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

చట్ పూజ సందర్భంగా చెరుకు పంపిణీ

ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే పవిత్ర చట్ పూజ పండుగను పురస్కరించుకొని ముత్తంగి డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఉత్తర భారతీయులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో కొనుగోలు చేసిన చెరుకును పంపిణీ చేశారు. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, కాశీరెడ్డి, మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, రామకృష్ణ, డీఈ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

5 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago