ఛట్ పూజ సందర్భంగా 50 వేల మంది ఉత్తర భారతీయులకు 10 లారీల చెరుకు పంపిణీ
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరు నియోజకవర్గం నిలుస్తోందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ పురస్కరించుకొని శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, ఇస్నాపూర్, పాశమైలారం, బొల్లారం, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల, బొంత పల్లి, ఖాజీపల్లి, తదితర ప్రాంతాలలో నివసిస్తున్న 50 వేల మంది ఉత్తర భారతీయులకు 10 లారీల చెరుకును సొంత నిధులతో కొనుగోలు చేసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరి సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సైతం తగు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా పటాన్చెరు సాకి చెరువు కట్ట పైన ఛట్ పూజ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకటేష్, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…