Telangana

పార్కుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత – సీఎంసీ కమిషనర్ జి. సృజన

మనవార్తలు ప్రతినిధి: – శేరిలింగంపల్లి సైబరాబాద్:

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కులను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ జి. సృజన తెలిపారు. శనివారం రోజు సీఎంసీ ప్రధాన కార్యాలయం లో కమిషనర్ విలేఖరుల తో మాట్లాడుతూ సీఎంసీ పరిధిలో మొత్తం 770 కాలి స్థలాలు ఉన్నాయని, అవి కబ్జా కాకుండా 300 స్థలాలకు ప్రహరీ గోడలు నిర్మించామని, ఇంకా 470 స్థలాలకు గోడలు కట్టాల్సి ఉందని, వాటిని పార్కులుగా మారుస్తామన్నారు. పార్కుల్లో పచ్చదనం పెంపు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలు, సీనియర్ సిటిజన్లకు విశ్రాంతి సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఇటీవల పార్కుల అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె, పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

వర్క్ ఫ్రమ్ పార్క్ కార్యక్రమానికి శ్రీకారం

పార్కుల్లో వాకింగ్ టైం అయిపోయాక కాలిగా ఉంచ కుండా సాఫ్ట్వేర్ నిపుణుల కోసం చైర్లు, బెంచీలు ఏర్పాటు చేసి వై ఫై సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇది సక్సెస్ అయితే అన్ని డివిజన్లలో అమలు చేస్తామన్నారు.పార్కుల నిర్వహణ ఖర్చుల కోసం నామా మాత్రపు రుసుం వసూల్ చేస్తామన్నారు.

అభివ్రుద్ది పనులు పూర్తయిన చోట బోర్డులు ఏర్పాటు చేస్తాం

యిన చోట అవి చేసిన కాంట్రాక్టర్ చేత వాటి నాణ్యత ను తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వాటిపై పనుల విలువ, అధికారి పేరు తో పాటు ప్రజలు పిర్యాదు చేయడం కోసం క్యూ ఆర్ కోడ్ ను పెడతామన్నారు.రీ సైక్లింగ్ ప్లాస్టిక్ తో బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేసి,చెత్తను కూడా రీ సైక్లింగ్ చేస్తామన్నారు. ఎల్ నినో ప్రభావాన్ని సృష్టిలో పెట్టుకొని మొక్కలకు, నిర్మాణాలకు ఇతర అవసరాలకు రీ సైక్లింగ్ వాటర్ నే ఉపయోగించాలని బిల్డర్లకు హెచ్చరించాని, తాము కూడా అవే వాటర్ ను వాడుతున్నామన్నారు. పార్కులోను, బోర్లు ఉన్న చోట నీటి సంపులను నిర్మిస్తామన్నారు. ప్రతీ నిర్మాణ ప్రదేశంలో ఇంకుడు గుంతలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చికెన్ వేస్టేజీలను సేకరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

విద్యార్థుల భాగస్వామ్యం…….

సీఎంసీ పట్టణ ప్రణాళికలో విద్యార్థుల భాగస్వామ్యం

పట్టణ అభివృద్ధి ప్రణాళికలో విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ‘చైల్డ్ ఫ్రెండ్లీ సీఎంసీ’ కార్యక్రమాన్ని చేపడుతోందనీ. యునిసెఫ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు, యువత పాఠశాలల పిల్లలతో సంప్రదింపులు జరిపి వారి సమస్యలు, అవసరాలు, సూచనలను తెలుసుకోనున్నట్లు తెలిపారు.
సీఎంసీ పరిధిలోని 76 వార్డులకు కనీసం 152 మంది రిసోర్స్ పర్సన్లను గుర్తించి, పిల్లల అభిప్రాయాలను పట్టణ ప్రణాళికలో భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 20 నుంచి 23 వరకు ‘లిజనింగ్ టు చిల్డ్రన్’ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. పిల్లలకు అనుకూలమైన, సురక్షితమైన నగర నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ట్రాఫిక్ రద్దీ తగ్గింపునకు ప్రత్యేక చర్యలు

సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పోలీసులు, వేరే దేశాల ప్రతినిధుల సలహాలు తీసుకొని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జంక్షన్ ల వద్ద వన్ వే రూప్ లను నిర్మిస్తామని తెలిపారు.
కొబ్బరి బోండాల ను సేకరించి వాటి తో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి వాటిని ఏ విధంగా వినియోగించే విషయాన్ని ఆలోచిస్తున్నామన్నారు.
రైటింగ్ విషయంలో సీఎంసీ కి ఏ ప్లన్ గ్రేడింగ్ రావడం చాలా సంతోమని, దీన్ని ఇలాగే కొనసాగించేలా తమ సిబ్బందికి సూచిస్తామని తెలిపారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

5 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

20 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago