Telangana

మంజీరా పాఠశాలలో దీపావళి సంబరాలు

మైత్రి సమ్మేళనం.. దీపావళి వేడుకల్లో సందడి!

హాలోవీన్ వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు

ఫుడ్ స్టాల్స్, పంట ఉత్పత్తుల ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

మైత్రి సమ్మేళనం వేదికగా మంజీరా పాఠశాలలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయాలకు ఆధునికతను జోడిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. హాలోవీన్ థీమ్, ఆకర్షణీయమైన ఫుడ్ స్టాల్స్, పంట ఉత్పత్తుల ప్రదర్శనలు, లక్కీ డ్రాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసేలా కార్యక్రమాలను రూపొందించారు. తల్లిదండ్రులు స్వయంగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం, వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.దీపావళి పండుగ వెనుక ఉన్న నైతిక సందేశాన్ని వివరిస్తూ నరకాసుర వధ ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియజేశారు. ప్రతి మనిషిలో ఉండే అసూయ, అహంకారం, కోపం, ద్వేషం వంటి చెడు లక్షణాలను విడిచిపెట్టి ప్రేమ, ఆప్యాయత, మానవత్వంతో జీవించాలని సూచించారు.వేడుకల్లో భాగంగా పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్‌కు ప్రత్యేకంగా లక్కీ డ్రాలు నిర్వహించారు. పాఠశాల ఉద్యోగులు, డ్రైవర్లు, క్లీనర్లకు సైతం ప్రత్యేక లక్కీ డ్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరినీ వేడుకల్లో భాగస్వాములను చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ జగన్ మోహన్, ప్రిన్సిపల్ డి. రేవతి మాట్లాడుతూ కార్యక్రమ విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, డ్రైవర్లు, క్లీనర్లు, ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యతో పాటు సామాజిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేయడమే ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.భవిష్యత్తులోనూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దీపావళి శుభాకాంక్షలతో వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జగన్ మోహన్, ప్రిన్సిపల్ డి. రేవతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago