Telangana

గోయాజ్ 30వ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ స్టోర్‌ను ప్రారంభించిన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ సి.హెచ్. ప్రీతి రెడ్డి

సికింద్రాబాద్, మనవార్తలు ప్రతినిధి:

భారతదేశంలోనే అతిపెద్ద, ప్రముఖ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్‌గా సుపరిచితమైన ‘గోయాజ్’ (GOYAZ) తన శరవేగ విస్తరణలో భాగంలో మరొక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్‌లోని అత్యంత కీలకమైన వ్యాపార కేంద్రమైన పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో ఏర్పాటు చేసిన సంస్థ 30వ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్‌ను నవంబర్ 6న వైభవంగా ప్రారంభించారు. సుమారు 2,500 చదరపు అడుగుల విశాలమైన విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ అత్యధునిక స్టోర్‌ను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ సి.హెచ్. ప్రీతి రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలో గోయాజ్ షోరూమ్ నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరిలతో పాటు పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు వినియోగదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.కాలానుగుణమైన కళాత్మక నైపుణ్యాన్ని సమకాలీన ట్రెండ్స్‌కు అనుగుణంగా ఉండే ఆధునిక డిజైన్లతో మేళవిస్తూ వినూత్న శైలిలో ఈ స్టోర్‌ను తీర్చిదిద్దారు. దక్షిణ భారతదేశంలో వెండి ఆభరణాల రంగానికి సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ వస్తున్న గోయాజ్, ఈ కొత్త స్టోర్ ద్వారా పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కావలసిన భారీ ఆభరణాలతో పాటు, బహుమతులుగా ఇచ్చేందుకు మరియు రోజువారీ వినియోగానికి అనువైన వెండి వస్తువులను అందుబాటులోకి తెచ్చింది.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ, సికింద్రాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన లగ్జరీ సిల్వర్ జ్యువెలరీని మరింత చేరువ చేయడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని ప్రధాన నగరాలకు తమ నెట్‌వర్క్‌ను విస్తరించి, లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ విభాగంలో అగ్రగామిగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పాట్నీ నూతన స్టోర్‌లో లభించే ఈ ప్రత్యేకమైన సర్వీసెస్, కలెక్షన్స్ మరియు ప్రారంభోత్సవ ఆఫర్లను వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు.

వినియోగదారులను ఆకట్టుకునే ‘గ్రాండ్ ఇనాగురల్ ఆఫర్స్ :

స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కొనుగోలుదారుల కోసం యాజమాన్యం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది:

₹15,000 పైగా కొనుగోలు చేసిన వారికి ఒక ఉచిత గోల్డ్ కాయిన్‌తో పాటు ₹3,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.

₹30,000 కొనుగోలుపై ₹7,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.

₹50,000 కొనుగోలుపై ₹12,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.

₹1,00,000 కొనుగోలుపై ₹25,000 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.

₹2,00,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై ఏకంగా ₹55,000 విలువైన వెండి ఆభరణాలను ఉచితంగా అందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

 

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

5 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

20 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago