– కూటములుగా ఏర్పడిన విజయం ఎర్రజెండాదే..!
– కార్మిక క్షేమమే సిఐటియు ధ్యేయం
– కార్మికుల ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన
– కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునేది సిఐటియునే
– గెలిపించిన తోషిబా కార్మికులకు ఈ విజయం అంకితం
ఐఎన్టీయూసి, బీఎంఎస్ కూటమిపై సీఐటీయు 50 ఓట్ల మెజార్టీతో గెలుపు
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, తోషిబా పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు జే మల్లికార్జున్
– పరిశ్రమలో కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీ
– పటాన్ చెరు లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో శనివారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు వరుసగా ఐదవ సారి విజయభేరి మోగించింది. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు జే మల్లికార్జున్ బరిలో నిలువగా, కూటమి అభ్యర్థి ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్, బిఎంఎస్ అఖిల భారత అధ్యక్షులు మల్లేశంపై 50 ఓట్లతో గెలుపొందారు.పరిశ్రమలో మొత్తము 1193 ఓట్లకు గాను 1178 ఓట్లు పోలవగా 15 ఓట్లు చెల్లలేదు. మల్లికార్జున్,ఆర్డీ చంద్రశేఖర్ పై 50 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కార్మికులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పటాన్ చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ మే ద్యేయంగా పనిచేస్తున్న సిఐటియు ఎర్రజెండా ను ఐదవ సారి గెలిపించిన తోషిబా కార్మికులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు ఇచ్చిన హామీలను రాబోయే రోజుల్లో నెరవేర్చే విధంగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని కూటములుగా ఏర్పడిన ఎన్ని ఎత్తులు పన్నిన కార్మికుల విజయం ముందు అవన్ని బోసిపోయాయన్నారు. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు రక్షించుకుంటామని,కార్మికులను కంటికి రెప్పలా కాపాడేది సీఐటీయూనేనని అన్నారు.మెరుగైన వేతన ఒప్పందాలు, కార్మికులకు చట్టపరమైన సౌకర్యాల సాధన సీఐటీయూతోనే సాధ్యమన్నారు. కార్మికుల మధ్య అనేక కుట్రలు పని అడ్డదారిలో గెలవాలనుకున్న వారికి ఈ విజయం చెంప పెట్టు లాంటిదన్నారు. ఎల్లవేళలా కార్మికుల సంక్షేమానికి వారి హక్కుల సాధనకు పాటుపడేది ఒక సీఐటీయూ మాత్రమే అన్నారు. అబద్ధాలే తమ విజయాలుగా చెప్పుకుంటూ కూటమిగా కార్మికుల ముందుకు వచ్చినప్పటికి, కార్మికులు సిఐటియునే విశ్వసిస్తారనటానికి ఈ విజయమే ఒక నిదర్శనమని, ఈ విజయం కార్మికుల విజయంగా అభివర్ణించారు. రానున్న కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో మరిన్ని కార్మిక సంక్షేమానికి ముందుంటామని,వరుసగా ఐదవ సారి విజయం అందించిన కార్మికులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య,ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, వాజిద్ అలీ, అనంతరావు, శ్రీధర్, అతిమేల మాణిక్, పాండు రంగారెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, బి.ఎస్ రాజు లకాన్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…