హక్కుల ప్రాధాన్యత గురించి వివరించిన వక్తలు
మన వార్తలు ,నెల్లూరు:
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఆవిర్భావ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో గల నెల్లూరు పట్టణం లోని శ్రీరాములు ఎన్ జి ఓ కళ్యాణ మండపం లో వరల్డ్ హ్యూమన్ రైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు నిర్వహించిన సేవాభారతి అవార్డ్ 2021 ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని జిల్లాల నుండి 115 మంది హాజరై విజయవంతం చేయడమైనది అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో సేవా భారతి అవార్డ్ రావడానికి కృషి చేసిన సంతోష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం అయినది మెదక్ జిల్లా రేగోడ్ మండలం ప్యారారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా మానవ హక్కుల సంఘం చైర్మన్ తెనుగు నర్సింలు ను సేవాభారతి అవార్డ్ తో సత్కరించడం జరిగింది.
జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ73 వ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని, ప్రతీ ఒక్కరూనిరాశవీడండి, హక్కులు తెలుసుకుంటూ, తెలియజేస్తూ ఉండాలని సూచించారు. మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో వివిధ రంఘాల్లో సేవలు అందిస్తున్న 240 మందికి సేవాభారతి అవార్డుతో సత్కరించడం జరిగిoదని తెలిపారు. అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 6 దేశాల్లో తమ సంస్థ విస్తరించిందని తెలిపారు. ఆగస్టు 15 న ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.
ఎవరికి ఏ సమస్య వచ్చినా తీర్చడానికి తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. రేపటి వెలుగుల ప్రపంచం కోసం పాటు పడాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేయడం కోసం సంఘం సభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ స్రవంతి,రిటైడ్ జిల్లా జడ్జి మాల్యాద్రి,జిల్లా యూత్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి, బార్ కౌన్సిల్ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి,డబ్బు హెచ్ ఆట ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు,తెలంగాణ రాష్ట్రo నుండి వివిధ జిల్లాల చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…