Telangana

ప్రతి ఓటమి విజయానికి తొలి మెట్టు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థి దశనుండే మానసిక ధైర్యం పెంపొందించుకోవాలని.. ప్రతి ఓటమి విజయానికి తొలిమెట్టు లాంటిదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో నిరుపేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడంలో భాగంగా కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదగ్గ పరిణామం అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా జస్ట్ డయల్,. పేటీఎం, టెక్ మహీంద్రా సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూలో డిగ్రీ కళాశాలకు చెందిన 26 మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు. మీరందరికి ఎమ్మెల్యే జిఎంఆర్ చేతులమీదుగా ప్లేస్మెంట్ లెటర్లు అందించారు.. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్, ప్రవీణ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

4 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

16 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

17 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

17 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

17 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago