Telangana

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి:

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ​సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలోని సర్వే నెం. 1 కి సంబంధించిన 150 ఎకరాల భూ బాధితులైన రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతిక్ జైన్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి రైతులు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో ఈ భూమిని హెచ్ఎండిఏ కి కేటాయించినప్పటికీ, నేటి వరకు రైతులకు ఎలాంటి ప్లాట్లు లేదా సరిహద్దులు కేటాయించకపోవడం వల్ల రైతులు తీవ్ర అ భద్రతాభావాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్వే నంబర్ 1 ని ధరణి పోర్టల్ నుండి తొలగించడం వల్ల గత నాలుగేళ్లుగా రైతుబంధు, రైతుబీమా వంటి కీలకమైన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక రైతులు అకారణంగా నష్టపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా ఈ భూమిని టీజీఐఐసి కి బదిలీ చేయాలని, అలాగే గుమ్మడిదల తరహాలో ఎకరానికి రూ. 60 లక్షల నష్టపరిహారంతో పాటు 100 చదరపు గజాల ఇంటి ప్లాట్‌ను అర్హులైన రైతులందరికీ అందించేలా ప్రభుత్వానికి తక్షణమే సానుకూల నివేదిక పంపాలని కలెక్టర్‌ను కోరారు. రైతుల పక్షాన నిలబడి వారికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు అవసరమైన అన్ని స్థాయిల్లోనూ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాపరెడ్డి, నాయకులు రాజేందర్ రెడ్డి, బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

5 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

6 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

11 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

23 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

23 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

24 hours ago