Telangana

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక

అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు చెన్నారెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  63వ జన్మదిన వేడుకలు నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే జిఎంఆర్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకునేందుకు పలువురు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని ప్రఖ్యాత పూరి సముద్ర తీరంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  పేరుతో ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని రూపొందించారు. పటాన్ చెరు నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సైకత శిల్పాన్ని తయారు చేయించారు.ఇసుకతో అత్యంత ఆకర్షణీయంగా రూపొందించిన ఈ శిల్పం పూరి బీచ్‌కు వచ్చిన సందర్శకులను సైతం ఆకట్టుకుంది. ఎమ్మెల్యే జిఎంఆర్ 63వ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు తమ అభిమానాన్ని ఇలా వినూత్నంగా వ్యక్తం చేయడం ప్రత్యేకంగా నిలిచింది.ప్రస్తుతం పూరి పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా బీచ్‌కు చేరుకొని సైకత శిల్పాన్ని వీక్షించారు. తనపై అభిమానంతో ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని రూపొందించిన చెన్నారెడ్డిని అభినందించారు. అభిమానులు, కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ కృతజ్ఞతలు తెలిపారు.తన జన్మదినాన్ని పురస్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా వేడుకలు నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజా సేవకు అంకితం చేయడం అభినందనీయమని పేర్కొంటూ, తనపై అభిమానంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పటాన్ చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదినం సందర్భంగా పూరి బీచ్‌లో రూపుదిద్దుకున్న ఈ సైకత శిల్పం అభిమానానికి, ఆప్యాయతకు వినూత్న ప్రతీకగా నిలిచింది.

 

admin

Recent Posts

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

18 minutes ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

6 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

18 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

18 hours ago

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, ఎస్‌ఆర్ ఎస్టేట్స్, నైలా గేటెడ్ కమ్యూనిటీ,…

19 hours ago

గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన రాహుల్ రెడ్డి, దయాకర్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రపురం: తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో శనివారం వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ…

19 hours ago