Telangana

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

  • రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది
  • లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం
  • నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టి, ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర కుట్రలు చేస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల తరఫున నిలబడి కేంద్రాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజాదరణను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందులో భాగంగానే ఆయనతో పాటు ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని మండిపడ్డారు.రాహుల్ గాంధీ తో పాటు ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ‘చలో లోక్ భవన్’ నిరసన కార్యక్రమంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు.నెక్లెస్ రోడ్‌లోని ఇందిరమ్మ విగ్రహం వద్దకు వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యువతతో కలిసి ఆయన రాజ్ భవన్ వైపు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూరాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం దారుణంగా చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నీట్ పేపర్ లీకేజీ కుంభకోణంతో విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. ఈ దారుణమైన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.కక్షసాధింపు చర్యలతో ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపినంత మాత్రాన కాంగ్రెస్ పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు. విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దేశ ప్రజలు, యువత తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వీర్లపల్లి శంకర్, అంబర్ పేట్ ఇంచార్జీ డాక్టర్ సి రోహిన్ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ , ఎన్ఎస్ యుఐ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు భారీగా పాల్గొన్నారు.

admin

Recent Posts

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

12 minutes ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

13 minutes ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago

ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు  పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…

1 day ago

మానవత్వం చాటుకున్న తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్-02, 68వ బ్లాక్‌కు చెందిన దాసు ఆకస్మిక…

1 day ago