మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యమని ఆ విషయాన్ని బిస్లరీ యజమాన్యం మరిచి కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు యజమాన్యం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడ లోని బిస్లరీ పరిశ్రమల్లో అక్రమంగా తొలగించిన కార్మికులను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికులకు సంఘీభావంగా బిస్లరీ యూనియన్ అధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొని బిస్లరీ కార్మికులకు బియ్యం, కిరాణం సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ బిస్లరీ యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే వీధిలోకి తీసుకోవాలని, బిస్లరీ కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని, యాజమాన్యం మొండివైఖరి మానుకొని కార్మికుల సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. గత 42 రోజులుగా బిస్లరి కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం పట్టుదలగా సమ్మె చేస్తున్నారని, 1926 ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం యూనియన్ పెట్టుకుంటే నేరమా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని యాజమాన్యం, కార్మిక శాఖ, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులకు తెలియజేసినప్పటికీ యూనియన్ గుర్తించకపోవడం కక్షపూరితంగా కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు.
గత తొమ్మిది నెలలుగా యూనియన్ జనరల్ సెక్రెటరీ ఆఫీస్ బేరర్స్ ఐదు మంది కార్మికులు బయట ఉన్నారని, యాజమాన్యం సమస్యను పరిష్కరించకపోవడంతోనే కార్మికులు సమ్మెలోకి రావలసిన పరిస్థితి ఏర్పడిందని, దీనికి పూర్తి బాధ్యత బిస్లరీ యాజమాన్యందే అన్నారు. బిస్లరి యాజమాన్యం కక్షపూరితంగా కార్మికులను బాధ పెట్టడం సరైనది కాదని, యజమాని పెట్టుబడి పెట్టినంత మాత్రాన పరిశ్రమ ఉత్పత్తులు తీయలేమని కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం అన్నారు. ఇప్పటికే అధికారులను కార్మిక శాఖ మంత్రి లేబర్ కమిషనర్ కలిశామని, కార్మికులను రెచ్చగొట్టే విధానం మానుకోవాలని యజమాన్యానికి హితవు పలికారు. జాయింట్ లేబర్ కమిషనర్ దగ్గర చర్చలు జరుగుతున్నాయని యాజమాన్యం ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బిస్లరీ కార్మికుల అండగా సిఐటియు ఉంటుందని రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బిస్లరీ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్మిక వర్గం అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 42 రోజులుగా పట్టుదలగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికులు ఇదే ఐక్యతతో సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
వివిధ యూనియన్ల నుండి సంఘీభావం మద్దతు
శాండ్విక్, కిర్బీ, పెబ్ పెన్నార్, పార్లే, వాగ్వాల్స్, సుగుణ పౌల్ట్రీ యూనియన్ల నాయకులు సంఘీభావ మద్దతు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు, జిల్లా కోశాధికారి కె రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాజు, కిర్బి, యూనియన్ జనరల్ సెక్రెటరీ వి.ఎస్ రాజు, శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ప్రదీప్, పార్లే యూనియన్ జనరల్ సెక్రెటరీ సంతోష్ గౌడ్, పెబ్ పెన్నార్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, వాగ్బాల్స్ జనరల్ సెక్రెటరీ ఆఫీజ్ నాయకులు తలారి శ్రీనివాస్, సుధాకర్, మల్లేష్, లకన్, విట్టల్, రాజిరెడ్డి, శ్యాంబాబు, శంకర్, జైపాల్, మహేశ్వర్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్-02, 68వ బ్లాక్‌కు చెందిన దాసు ఆకస్మిక…