మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ చలో ఢిల్లీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్ పేర్కొన్నారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ విస్తృత సమావేశం సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జయరాజు మాట్లాడుతూ నీట్ ఎగ్జాం లో గత 23 సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 11 సార్లు నీటు పరీక్ష పత్రం లీక్ కావడం వెనక బిజెపి ప్రభుత్వం హస్తం ఉందని విమర్శించారు. ప్రస్తుత సంవత్సరంలో నీట్ పరీక్ష పత్రం లీక్ కావడం వ్యవహారంలో గత నాలుగైదు నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతున్న విషయం ప్రజానీకానికి తెలిసిందే అన్నారు.
నీట్ పేపర్ లీకేజీ అయిన విషయంలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఢిల్లీలో సీజేపీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన విషయంలో చలో ఢిల్లీ సందర్భంగా 1,50,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆందోళనను పట్టించుకోకుండా పోలీసుల చేత బలవంతంగా భాష్పవాయువు ప్రయోగించి, పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరపడం సరైన పద్ధతి కాదన్నారు. అనేకమంది యువకులు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడ్డారని ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న దేశ ప్రధానమంత్రి ఎక్కడా పట్టించుకోకుండా సమస్యను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నారని, సమస్యకు సంబంధం లేకుండా ఉన్న కేంద్ర వైద్యశాఖ మంత్రితో చర్చలు జరపడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటన పట్ల ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వైరల్ కాకుండా పెద్ద ఎత్తున నియంత్రించే కార్యక్రమాలు చేపడుతుందని వాంగ్ చుక్ చేపట్టిన ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
వానం వాంగ్ చుక్ ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని అందుకోసం చలో ఢిల్లీ సందర్భంగా జరిగిన లాఠీ చార్జీ తీవ్రంగా ఖండిస్తున్నామని, విద్యార్థులు యువకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనను తీవ్రతను చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య, ఏ. మాణిక్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు పీ పాండురంగారెడ్డి, ఎంజీబీఎస్ ప్రసాద్, బి వి ఆర్ కే రాజు, సుధాకర్, కే వెంకట్రాంరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఉదయ్, జయరాం తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…
బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…