జిన్నారం శివాలయం అభివృద్ధికి 36 లక్షల రూపాయలు అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

శివాలయం మండప నిర్మాణానికి శంకుస్థాపన

గతంలో దేవాలయం అభివృద్ధికి 16 లక్షల రూపాయల సొంత నిధుల విరాళం

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం:

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో గల శ్రీ జీవన జ్యోతిర్లింగ శివాలయం ఆవరణలో 36 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించనున్న శివాలయం మండపం నిర్మాణ పనులకు బుధవారం ఉదయం శంకుస్థాపన చేసిన పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. దేవాలయం అభివృద్ధికి గతంలో 16 లక్షల రూపాయల సొంత నిధులు అందించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాజరైన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తహసిల్దార్ ఆంథోనీ, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *