Hyderabad

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి…

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి…

ఎంపీ కోమటి రెడ్డి డిమాండ్

-సీఎం కేసీఆర్ కు లేఖ

– చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షల సాయం చేయాలి
-జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించండి
జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిచాలని భవనగిరి పార్లమెంట్ సభ్యుడు . కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రలో అనేక మంది జరన్లిస్టులు కరోనా భారిన పది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ తన విధినిర్వహణలో ప్రాణాలు పోగుట్టుకుంటున్నారని అన్నారు. పోలీస్ , పారిశుధ్య కార్మికులు,, వైద్య సిబ్బంది లాగానే జర్నలిస్టులు కూడా పని చేస్తున్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. అనేక రాష్ట్రాలు జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలంగాణాలో ఎందుకు గుర్తించటంలేదో అర్థం కావడంలేదని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ వెంటనే జర్నలిస్టుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా , చేర్యాల మండలం చెందిన సాక్షి టీవీ రిపోర్టర్ చెలుకుల వెంకట్ రెడ్డి కరోనా తో మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజెస్తున్నాను. ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్   వారియర్స్ ” గా గుర్తించారు. వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయి. కరోనా తో చనిపోయిన జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం కూడా చెల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించాలి . వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం తెలంగాణ ప్రభుత్వం చేయించాలి . నిత్యం ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులు కరోనాతో చనిపోతే ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను.

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago